విజయవాడ వరద బాధితులకు విశాఖ జిల్లా యంత్రాంగం బాసటగా నిలిచింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, పులిహోర, పాలు, తాగునీరు, బిస్కెట్లు, రొట్టెలు, కొవ్వొత్తులు సమకూర్చి ప్రత్యేక వాహనాల ద్వారా బుధవారం విజయవాడ తరలించింది. పూర్తి ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పర్యవేక్షించారు.