రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో విశాఖకు చెందిన పిసిసి మాజీ అధికార ప్రతినిధి ప్రియాంక దండి బుధవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో భేటీ అయ్యారు. మహిళల సాధికారత స్వయం ఉపాధిపై పార్టీ తరఫున పని చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో అన్ని అంశాలలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తానన్నారు.