యలమంచిలి: దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన మాజీ ప్రధాని

52చూసినవారు
ప్రధానిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు. శుక్రవారం యలమంచిలి క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మన్మోహన్ సింగ్ కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్