ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

73చూసినవారు
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్
AP: దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ నెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నెలకొకటి చొప్పున 12 మాసాలకు 12 థీమ్‌లతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్