'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో బుల్లి రాజుగా ఆకట్టుకున్న బాలనటుడు రేవంత్ క్షమాపణలు చెప్పారు. ఇవాళ మూవీ సక్సెస్ మీట్‌లో రేవంత్ మాట్లాడాడు. 'సినిమాలో చూపించినట్లు నా లాగా ఓటీటీలు చూసి ఎవరూ పాడు అవ్వొద్దు. నా లాగా తిట్టవద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసం సినిమాలో ఇలా చేశాం అంతే' అని సారీ చెప్పారు. రేవంత్ ఈ మూవీలో వెంకటేశ్ కొడుకుగా నటించి, అలరించిన విషయం తెలిసిందే.