సభ్యుల కోరం సరిపోకపోవడంతో గొలుగొండ మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఎంపీపీ గజ్జలపు మణికుమారి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ఈ సమావేశంను ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి 15 మంది ఎంపీటీసీలు హాజరు కావలసి ఉండగా కేవలం నలుగురు మాత్రమే హాజరు కావడంతో సమావేశంను వాయిదా వేశారు. మళ్లీ సమావేశం ఎప్పుడు అన్నది త్వరలో ప్రకటిస్తామని ఎంపీడీఓ మేరీరోజ్ తెలిపారు.