అనకాపల్లి శారదా నది బ్రిడ్జి మీద తగినంత విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రిడ్జి మీద ఉన్న లైట్స్ పూర్తిగా వెలిగేలా చర్యలు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇంచార్జ్ సూది కొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కొత్తూరు గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.