శ్రీమహాలక్ష్మి కల్చలర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గిడిజాల జిల్లా పరిషత్ హై స్కూల్లో 19న శనివారం 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ అధినేత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ శుక్రవారం తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.