భీమిలి: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పెద్ద సమస్యగా మారిందని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు అన్నారు. మంగళవారం జీవీఎంసీ 7వ వార్డు పరిధి మల్లయ్యపాలెం, అయోధ్యనగర్, కొత్తపాలెంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. పైడిరాజు మాట్లాడుతూ. కూరగాయలు, పప్పులు, బియ్యం, వంట నూనె వంటి ధరలు సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతోందన్నారు.