భీమిలి: పది మందికి రూ. లక్ష జరిమానా
విశాఖ జిల్లా పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి స్పెషల్ జ్యూడిషియల్ కోర్టు అపరాధ రుసుము విధించింది. పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు ఆ 10 మందిని స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ రెండవ తరగతి ఎక్సైజ్ కోర్టు ఎదుట హాజరు పరచగా, ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున మొత్తం రూ. లక్ష అపరాధ రుసుమును సోమవారం విధించింది.