విశాఖలోని శారదా పీఠం భూములను వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విదసం హర్షం వ్యక్తం చేస్తూ త్వరిత గతిన ప్రక్రియ పూర్తి చేయాలని విదసo ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు నేతృత్వలో ఆదివారం స్థలాన్ని పరిశీలించారు. స్వరూపానంద స్వామి జగన్ గెలుపు కోసం యాగం చేసినందుకు క్విడ్ ప్రో కో పద్ధతిలో వందల కోట్లు విలువైన భూములు కేవలం రూ.15లక్షలకు కట్టబెట్టారని విమర్శించారు.