నర్సీపట్నం: జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు

70చూసినవారు
జెడ్పీ నిధులను నర్సీపట్నం మండలంలో అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నట్టు స్థానిక జెడ్పిటిసి సుకల రమణమ్మ శుక్రవారం తెలిపారు. అనేక గ్రామాలలో రోడ్లు, కాలువలు నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అంగన్వాడీ సెంటర్లలో ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసామన్నారు. శనివారం జరగబోయే బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయింపు అంశంపై చర్చిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్న ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్