కౌశల్ సైన్స్ రాష్ట్రస్థాయి ప్రతిభా పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ వేములపూడి లో చదువుతున్న ఎర్రవరం గ్రామానికి చెందిన బాలిక పొలిరెడ్డి రేవతి ఎంపికైనట్టు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ ఈనెల 6న జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయిందన్నారు. ఈనెల 29, 30 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.