నాతవరం మండలంలోని డి. ఎర్రవరం పంచాయతీ డొంకాడ అగ్రహారం గ్రామంలో రెండు రోజులు క్రితం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిల్లు దగ్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాసా సంస్థ ప్రమాద బాధితులకు నిత్యవసర వస్తువులు బట్టలు వంట సామాగ్రి మొదలైన వస్తువులను సంస్థ ప్రతినిధులు బాధితులు బుర్ర చిన్నారి, అప్పలకొండ, బంగారు దావీదుకు అందజేయడం జరిగింది.