భారతదేశం స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిన బాపూజీ చిత్రపటానికి గురువారం ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా హోంమంత్రి అనిత పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కూటమి పాలనలో సాధ్యమవుతుందని చెప్పారు. అహింసాయుత పోరాటం ద్వారా ఎంతటి విజయాన్నయినా సాధించవచ్చునని బాపూజీ నిరూపించారన్నారు. రాష్ట్ర ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలియజేశారు.