వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం 98వ వార్డు సింహపురి కాలనీ ప్రధాన ఆర్చ్ వద్ద 3వేల గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వైసిపి నాయకులు పీతల అప్పలరాజు, విష్ణుమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి విగ్రహాల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.