గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. పెందుర్తి మండలం జేరిపోతులపాలెంలో భోగి మంటను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. బాలికలు భోగిమంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. మూడు రోజులు పాటు గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.