అనంత వైద్యకళాశాలలో పారా మెడికల్ కోర్సుల్లో చేరడానికి ఈనెల 10న అడ్మిషన్ల కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యాలరావు బుధవారం తెలిపారు. మొత్తం 69 సీట్లు ఉన్నాయని, అందులో డీఎంఎల్డీ10, డీఓఏ10, డీఏఎన్ఎస్ 30, డీఎంఐటీ10, డీఈసీజీ3, డీఆర్ జీఏ3, డీడీఆర్ఎ3సీట్లు ఉన్నాయన్నారు. ఈ సీట్లకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 10న తమ ఒరిజనల్ సర్టిఫికెట్లు తీసుకొని అడ్మిషన్ల కౌన్సెలింగ్ కు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.