అనంతపురం ఆర్డీటీ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు 297కు ఆలౌట్ అయింది. ఎస్. రావత్ 124, అలీఖాన్ 51 (నాటౌట్), ఎస్. ముళణి 48 టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇండియా-సి జట్టు బౌలర్లలో వీ. వైశాక్ 4, ఏ. కంబోజ్ 3, జీ. యాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఇండియా–సి జట్టు బ్యాటింగ్ కు దిగింది.