అనంతపురంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న స్వగృహా స్వీట్ షాపుతో పాటు బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం తనిఖీ నిర్వహించారు. తయారీ అవుతున్న ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు హెచ్చరించారు. కలకండ, కొబ్బరి బిస్కెట్ శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు.