అసంతృప్తితో వైకాపా కౌన్సిలర్లు పార్టీలోకి వచ్చారు: గుమ్మనూరు

2216చూసినవారు
అసంతృప్తితో వైకాపా కౌన్సిలర్లు పార్టీలోకి వచ్చారు: గుమ్మనూరు
గుంతకల్లు మున్సిపల్ వైకాపా కౌన్సిలర్లు ఆపార్టీలో గుర్తింపులేక అసంతృప్తితో టిడిపిలోకి వచ్చారని నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం కసాపురం రోడ్డులోని టిడిపి కార్యాలయంలో వైకాపాకు చెందిన 4 గురు కౌన్సిలర్లు జయరాం ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్