విజయవాడ వరద ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా ఉత్తమ సేవలందించి జిల్లాకు మంచి పేరు తేవాలని గుంతకల్లు ట్రాన్స్ కో ఏడీఈ రంగ స్వామి సిబ్బందికి సూచించారు. వరదల కారణంగా విజయవాడలో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతినడంతో అక్కడ మరమ్మతులు చేయడానికి వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో గుంతకల్లు నుంచి ప్రత్యేక వాహనంలో 15 మంది సిబ్బంది మంగళవారం బయలుదేరారు. వాహనానికి ఏడీఈ పచ్చజెండా ఊపారు.