ఉరవకొండ: కన్నులపండువగా శ్రీరాముని కళ్యాణం

1066చూసినవారు
ఉరవకొండ పట్టణంలోని ఇందిరానగర్ 2వ వీధిలో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి శ్రీరామ సమేత సీత అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించి ఘనంగా కళ్యాణం జరిపారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్