అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరాన్ని నాశనం చేశారని, నిధులను స్వాహా చేశారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. 9 నెలల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేశామని టీడీపీ కౌన్సిలర్లు అన్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.