అనంతపురం మున్సిపల్ కార్యాలయం ఎదుటప ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేసారు. మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, వాచ్ మెన్ లకు పెండింగ్లో ఉన్న 5 నెలలు జీతాలు ఇవ్వాలన్నారు. 4వేల రూపాయలు ఉన్న జీతాన్ని 8వేలకు పెంచాల డిమాండ్ చేసారు. నేరుగా హెచ్ఎం అకౌంట్ లో కాకుండా పనిచేసే కార్మికుల ఖాతాల్లో జీతం జమ చేయాలన్నారు. జీతాలు పెంచకుండా అలసత్వం వహిస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు జి. చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.