తనిఖీలలో పట్టుబడ్డ పిడిఎస్ బియ్యం

55చూసినవారు
తనిఖీలలో పట్టుబడ్డ పిడిఎస్ బియ్యం
అనంతపురం జిల్లా బీకేయెస్ మండలంలో సిఐ సాయిప్రసాద్ వారిసిబ్బంది మంగళవారం తనిఖీలను నిర్వహించారు. కొట్టాల గ్రామంలో చెన్నంపల్లి గ్రామం రోడ్ వద్ద తనిఖీలో ఒక వాహనంలో రూ. 79, 200 విలువగల 33 సంచుల పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా జప్తుచేసి చట్టపరమైన చర్యలు తీసుకునెందుకు సిఎస్ డిటికు అప్పజెప్పారు. వాహన యజమాని, డ్రైవర్ పై పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసును నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్