బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో బుధవారం వేరుశనగ పంటను జిల్లా డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త రామసుబ్బయ్య ధర్మవరం డివిజన్ సహాయ సంచాలకులు కృష్ణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్, డిసెంబర్ మాసంలో వేసిన వేరుశనగ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని మచ్చ తెగులు ఆశిస్తే సాఫ్ 2. 0 గ్రాములు లీటరు నీటికి లేదా హెక్సాకోనజూల్ 2. 0 మిల్లి లీటర్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.