ధర్మవరం పట్టణం బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం 221 కేజీల ఇత్తడి గంటను క్రేన్ సహాయంతో ఆలయ కమిటీ పెద్దలు అమర్చారు. ఈ గంట విలువ సుమారు రూ.5.5లక్షల అని అర్చకులు భాను ప్రకాష్, మకరంద స్వామి తెలిపారు. కార్తీక మాసం చివరి సోమవారం రోజు ప్రత్యేకంగా క్రేన్ సహాయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గంటను అమర్చినట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు.