ధర్మవరం: ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి

50చూసినవారు
ధర్మవరం పట్టణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించి, పోలీస్ శాఖకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ఐ ఎస్. వెంకట రాముడు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం తమ సిబ్బందితో కలిసి పట్టణంలో పర్యటించారు. ఆటో డ్రైవర్లకు తగు సూచనలు ఇచ్చారు. ఆటో డ్రైవర్లు పరిమితి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోకూడదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఆర్. టి. ఓ కార్యాలయంలో వెళ్లి లైసెన్ కు అప్లై చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్