కూటమి ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయం నుంచి కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ కేతిరెడ్డి ఏఈకి వినతిపత్రం అందజేశారు.