ఎస్సీ కుల గణన అభ్యంతరాల స్వీకరణ గడువును కలెక్టర్ ఆదేశాల మేరకు జనవరి 7వ తేదీ వరకు పొడిగించామని ధర్మవరం ఎంపీడీవో సాయి మనోహర్ బుధవారం తెలిపారు. కులగణన అభ్యంతరాలు 11న నమోదు అవుతుందని, తుది కులగణన సర్వే వివరాలు 17న వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ కులగణన గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగియడంతో కలెక్టర్ మరో వారం రోజులు పాటు పొడిగించారని తెలిపారు.