రోడ్డు ప్రమాదంలో చోదకుడికి గాయాలు

11506చూసినవారు
రోడ్డు ప్రమాదంలో చోదకుడికి గాయాలు
ధర్మవరం మండలం కట్టకిందపల్లి వద్ద మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి రామ్ బహుదూర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కట్టకిందపల్లి వద్ద ఉన్న పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో పనిచేసే ఆయన ద్విచక్ర వాహనంలో ధర్మవరం నుంచి కట్టకిందపల్లి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డాడని గ్రామీణ పోలీసులు తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.

సంబంధిత పోస్ట్