ముదిగుబ్బ శ్రీ దేశాయి రెడ్డెప్ప రెడ్డి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి కాదన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఎ. టి. ఎల్ కృష్ణ, ఎస్. టి. ఎల్ కావేరి, తదితరులు పాల్గొన్నారు.