ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ధర్మవరం పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు కేతిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.