పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

81చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం
కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందించడం ప్రశంసనీయమని ప్రిన్సిపాల్ గోపాల్ అన్నారు. గుంతకల్లులోని శ్రీ శంకరానంద గిరిస్వామి డిగ్రీ కళాశాలలో 1995-1998 బికాం తెలుగు మాధ్యమం చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం కళాశాల అభివృద్ధికి రూ. 25 వేల చెక్కును ప్రిన్సిపల్ గోపాల్ కు అందజేశారు. అనంతరం నాడు చదువులు చెప్పిన గురువులు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, శ్రీనివాసులు ముచ్చటించి ఆశీర్వాదాలు పొందారు.

సంబంధిత పోస్ట్