గుత్తి: ఎస్సీ వసతి గృహం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

58చూసినవారు
గుత్తి: ఎస్సీ వసతి గృహం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
గుత్తిలోని ఎస్సీ వసతి గృహం విద్యార్థి తప్పిపోవడానికి కారకులైన వార్డెన్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ బుధవారం కోరారు. అనంతపురం జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడి కుష్బూ కొఠారిని కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ. సిబ్బంది అలసత్వంతోనే విద్యార్థి తప్పిపోయారని అన్నారు. వెంటనే చర్యలు తీసుకుని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్