గుత్తి మున్సిపాలిటీ ప్రజలు చెత్తను బాధ్యతారహితంగా ఎక్కడపడితే అక్కడ చెత్తను వేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పట్టణ ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం మున్సిపాలిటీలోని 11 వార్డులో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతంలో వేసిన చెత్తను ఆయన సంబంధిత శానిటరీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం చెత్తను తొలగించి అక్కడ ముగ్గులను వేసి ప్రజలు చెత్తను వేయకుండా చేశారు.