పామిడిలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు పేరుకుపోయాయి. వ్యర్థ పదార్థాలను బస్టాండ్ ప్రాంగణంలో విచ్చలవిడిగా వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో సమీప కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్ లోకి బస్సులు రాకపోకలు రాకపోవడంతో బస్టాండ్ నిరుపయోగంగా మారింది. బస్టాండును వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.