గుంతకల్లులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు శనివారం మూడవ రోజు విశేష అలంకరణలో దర్శనం ఇచ్చారు. పూజారులు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయంలో హోమం నిర్వహిస్తున్నారు. పుష్పాలంకరణ చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.