బాధితురాలికి ఆర్థిక సహాయం

82చూసినవారు
బాధితురాలికి ఆర్థిక సహాయం
హిందూపురం పట్టణానికి చెందిన ఓ మహిళ వైద్యం కోసం వాలీబాల్ క్రీడాకారులు ఆపన్నహస్తం అందించారు. అంబేడ్కర్ నగర్ కు చెందిన అంజప్ప, తిప్పమ్మల కుమార్తె గౌరీ అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతోంది. ఆమె ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వాలీ బాల్ క్రీడాకారులు ఆదివారం రూ. 15వేలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందులో మున్సిపల్ మేనేజర్ నరసింహులు, సీఐ శ్రీనివా సులు, చలంబాబు, శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.