కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

75చూసినవారు
కారు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
లేపాక్షి మండలంలోని బిసలమానేపల్లిలో శుక్రవారం రాత్రి కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం చెందాడు. బిసలమానేపల్లిలోని రాజీవ్ కాలనీకి చెందిన శ్రీరామప్ప(70) రాత్రి బిసలమానేపల్లి నుంచి కాలనీకి రోడ్డుపై పాకుతూ వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమార్తె, కోడలు, మనవడు ఉన్నారు. ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్