పది రోజులు గడుస్తున్నప్పటికీ నీళ్లు ఇవ్వకపోతే జీవనం ఎలా సాగించాలని హిందూపురం ఆజాద్ పేటకు చెందిన మహిళలు మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో గొల్లపల్లి రిజర్వేరు చెందిన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందని ట్యాంక్ ద్వారా పట్టణంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతున్నా తమకు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు.అధికారులు స్పందించాలని కోరారు.