హిందూపురం: సెలవు రోజుల్లో కూడా తరగతులు
హిందూపురం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ, చైతన్య పాఠశాలల పైన చర్యలు తీసుకోవలని ఆదివారం ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజులలో నారాయణ, చైతన్య విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తున్నారని మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గంగప్ప కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.