లేపాక్షి మండలంలో క్షుద్రపూజల కలకలం
లేపాక్షి మండలంలోని పులమతి ప్రధాన రహదారిలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నడిరోడ్డుపై మట్టితో తయారు చేసిన విగ్రహానికి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, రక్తంతో క్షుద్రపూజలు చేశారు. దీంతో గురువారం ఉదయం అటుగా వెళ్లిన వాహనదారులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చూసి భయాందోళనకు గురయ్యారు. గుప్తనిధుల కోసమా లేక ఎవరిపైనైనా చేతబడి చేశారా అనే అనుమానంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.