పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన

1194చూసినవారు
పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన
అనంతపురం జిల్లా తనకల్లు మండల ప్రజలకు యువమోర్చా అధ్యక్షుడు సోము రాయల్ సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరసత్వం సవరణ చట్టం కొత్తగా పౌరసత్వ నిచ్చేది కానీ భారతదేశంలో పుట్టి పెరిగిన అటువంటి వారి పౌరసత్వాన్ని తొలగించేది కాదని అన్నారు. ఈ చట్టం కేవలం మన పొరుగున ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ అప్ఘనిస్తాన్ దేశాలకు చెందిన క్రైస్తవ, హిందూ, ఇతర మైనార్టీ మతాలకు సంబంధించి ఏ పౌరులయితే మత వివక్షకు గురి కాబడి కట్టుబట్టలతో మన దేశంలోకి వచ్చి శరణు కోరారో వారికి పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం అని అన్నారు. అలాగే సీఏఎ ను సమర్ధిస్తూ 8866288662 ఈ నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి అని తెలిపారు.

ట్యాగ్స్ :