జమిలీ ఎన్నికలు అనవసరం అని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్. తులసి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కదిరి నియోజక వర్గం కాంగ్రెస్ సమన్వయ కర్త షానవాజ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ దేశమంతటా లోక సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు జరపడం అనవసరమని, ఆచరణ సాధ్యం కాదని అన్నారు. ఇందుకు 18 రాజ్యాంగ సవరణలు చేయాలని తెలిపారు.