కళ్యాణదుర్గం: సబ్ జైల్ ను తనిఖీ చేసిన న్యాయ సేవాధికారి

55చూసినవారు
కళ్యాణదుర్గం: సబ్ జైల్ ను తనిఖీ చేసిన న్యాయ సేవాధికారి
కళ్యాణదుర్గం పట్టణంలోని సబ్ జైల్ ను మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శివప్రసాద్ యాదవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సబ్ జైల్లోని బ్యారెక్కులు, బాత్రూములు, వంటగది తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ బయటికి వెళ్లిన తర్వాత సత్ప్రవర్తనతో నడుచుకోవాలన్నారు. తిరిగి నేరాల వైపు చూడకూడదన్నారు. ప్రశాంతంగా అందరితో కలిసి మెలిసి జీవించాలన్నారు.

సంబంధిత పోస్ట్