బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి రథోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి, అనంతరం సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహంను రథంలో ప్రతిష్టించారు. కర్ణాటక, కళ్యాణదుర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తాదులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించుకొని మొక్కులు తీర్చుకున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.