కళ్యాణదుర్గం: షాదీమహాల్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

53చూసినవారు
కళ్యాణదుర్గం: షాదీమహాల్ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
కళ్యాణదుర్గం పట్టణంలో షాదిమహల్ అభివృద్ధికి ఎమ్మెల్యే సురేంద్రబాబు తన సొంత నిధులతో రూ. 15లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా వేదిక వద్ద శనివారం ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అన్నారు. షాదీ మహల్లో పెళ్లిళ్లు, తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యేకు ముస్లిం సోదరులు విన్నవించారు. ఎమ్మెల్యే సొంత నిధులు కేటాయించడంతో ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్