కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే అజెండాగా ఎమ్మెల్యే సురేంద్రబాబు పనిచేస్తున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం ప్రజా వేదికలో విలేఖరులతో మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో బీటీపీని పట్టించుకోని నేతలు ఇప్పుడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెండేళ్లలో 114 చెరువులకు నీళ్లు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. రామ్మోహన్ చౌదరి, వైపి రమేష్ పాల్గొన్నారు.